Poison: ఆ గదిలో వేలాది తేళ్లు.. లీటరు విషం ఎంతో తెలుసా?

ఓ గదిలో వేలాది తేళ్లు ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాన్ని ఆదివారం ట్విటర్‌లో అప్‌లోడ్‌ చేసిన 12 గంటల్లోనే 40లక్షల మందికిపైగా వీక్షించారు.

Updated : 13 Dec 2022 11:02 IST

గదిలో వేలాది తేళ్లు ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాన్ని ఆదివారం ట్విటర్‌లో అప్‌లోడ్‌ చేసిన 12 గంటల్లోనే 40లక్షల మందికిపైగా వీక్షించారు. ఈ వీడియోను ఎక్కడ తీశారో స్పష్టత లేనప్పటికీ అందులో వినిపిస్తున్న మాటల ఆధారంగా బ్రెజిల్‌లో తీసి ఉండొచ్చని, అవి అత్యంత ప్రమాదకరమైన డెత్‌స్టాకర్‌ తేళ్లని అర్థమవుతోంది. ఈ తేళ్ల విషం ఎంతో ఖరీదైనది. ఒక్కో లీటరు 10.5 మిలియన్‌ డాలర్లు. అంటే దాదాపు రూ. 86 కోట్ల 76 లక్షలు. ఒక్క లీటరు కావాలంటే ఒక తేలు నుంచి దాదాపు 7లక్షల సార్లు గానీ, ఏడు లక్షల తేళ్ల నుంచి ఒక్కసారిగాని విషం తీయాల్సి ఉంటుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని