Ghulam Nabi Azad: భాజపాను గెలిపించేది కాంగ్రెసే: గులాం నబీ ఆజాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై జమ్మూకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని దుయ్యబట్టారు. 

Updated : 16 Apr 2024 13:36 IST

శ్రీనగర్: కాంగ్రెస్‌(Congress)ను ఉద్దేశించి డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (DPAP) అధినేత గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు ఆ పార్టీని చూస్తే.. విచిత్రమైన భావన కలుగుతుందన్నారు.

‘‘భాజపాతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందేమోనని కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంటుంది. పార్టీలో సంస్థాగతమైన మార్పు కోసం గతంలో 23 మంది నేతలు పోరాడారు. కానీ, అగ్రనాయకత్వం వారి మాటలు వినిపించుకోలేదు. సమస్యలు లేవనెత్తినప్పుడు.. మేమంతా భాజపా భాష మాట్లాడుతున్నామని విమర్శించేది. కానీ ఆ పార్టీనే భాజపాను గెలిపించాలని కోరుకుంటున్నట్లు నాకు చాలాసార్లు అనిపించింది’’ అని ఆజాద్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఈ దేశంలో పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలని ఆయన పేర్కొన్నారు.

‘మీరేం అమాయకులు కాదు’.. పతంజలి కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

సుమారు రెండేళ్ల క్రితం ఆజాద్‌ కాంగ్రెస్‌ను వీడారు. అప్పట్లో అగ్రనేత రాహుల్‌ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన రాకతో పార్టీ పతనం మొదలైందని మండిపడ్డారు. పరిణతి లేని ఆయన నాయకత్వం వల్లే  భారమైన హృదయంతో పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌లో సంస్థాగత మార్పులు తేవాలని, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తూ కొందరు సీనియర్లు (జీ-23 గ్రూపు) సోనియా గాంధీకి గతంలో లేఖ రాశారు. అది అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ నాయకుల్లో ఆజాద్‌తో పాటు కపిల్ సిబల్ వంటి వారు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌- రాజౌరీ స్థానం నుంచి ఆజాద్‌ (Ghulam Nabi Azad) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) సైతం ఇక్కడి నుంచే తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. వీరిద్దరూ మాజీ సీఎంలే. ఇక్కడున్న ఐదు లోక్‌సభ స్థానాలకు ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని