FloodWatch : ఇకపై వరద సమాచారం ఇట్టే తెలిసిపోతుంది.. అందుబాటులోకి ‘ఫ్లడ్‌వాచ్‌’ యాప్‌!

వరద (Flood) ముప్పు గురించి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఫ్లడ్‌వాచ్‌’ (FloodWatch) అందుబాటులోకి తీసుకొచ్చింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technolozy) వినియోగించుకొని ఈ యాప్‌ (APP) కచ్చితమైన సమాచారాన్ని వేగంగా చేరవేస్తుంది. 

Updated : 17 Aug 2023 19:22 IST

దిల్లీ : దేశవ్యాప్తంగా వరద (Flood) బీభత్స ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ‘ఫ్లడ్‌వాచ్‌’ (FloodWatch) పేరుతో ఓ సరికొత్త యాప్‌ను (APP) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ సాయంతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. దేశంలో ఎక్కడ వరదలు సంభవించినా.. ఆ ప్రభావిత ప్రాంతాల రియల్‌ టైమ్‌ సమాచారం ఇందులో ప్రత్యక్షం కానుంది. 338 స్టేషన్ల నుంచి వచ్చే సమాచారాన్ని ఈ యాప్‌ క్రోడీకరిస్తుంది. తద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తుందని సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్‌ కుశ్వీందర్‌ వోహ్రా తెలిపారు. 

బెంగళూరులో రూ. 6కే ఉబర్‌ రైడ్‌.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

వరద ప్రభావిత ప్రాంతాలకు మొబైల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేసి.. అక్కడి ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ యాప్‌ రూపకల్పన వెనకున్న ముఖ్య ఉద్దేశమని వోహ్రా వెల్లడించారు. ఏడు రోజుల వరకు సూచనలు ఇందులో కన్పిస్తాయన్నారు. శాటిలైట్‌ డేటా విశ్లేషణ, గణాంకాల నమూనా, రియల్‌ టైమ్‌ సమాచారాన్ని వినియోగించుకునే అధునాతన సాంకేతికత ఈ యాప్‌లో పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా సకాలంలో కచ్చితమైన అంచనాలు ప్రజలకు తెలుస్తాయని వివరించారు. 

‘ఫ్లడ్‌వాచ్‌’ యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌ సేవలను ఎవరైనా సులభంగా వినియోగించుకోవచ్చని వోహ్రా తెలిపారు. ఆడియో, టెక్ట్స్‌ రూపంలో ప్రజలకు సందేశాలు ఈ యాప్‌ ద్వారా సందేశాలు చేరవేస్తామన్నారు. ప్రస్తుతం ఇంగ్లిషు, హిందీ భాషల్లో మాత్రమే సేవలను పొందుపరిచామని, త్వరల్లో అన్ని స్థానిక భాషలను జత చేస్తామని చెప్పారు. వరద ముప్పుతో అల్లాడుతున్న హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో ‘ఫ్లడ్ వాచ్‌’ యాప్‌ సేవలు అందుబాటులోకి రావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని వోహ్రా వెల్లడించారు. 

గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్న ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగానే దేశం మొత్తంలో ఎక్కడెక్కడ వరదలు వచ్చాయో ఇండియా మ్యాప్‌పై కనిపిస్తుంది. రాష్ట్రాల పేరు ఆధారంగానూ శోధించి వరద సమాచారం తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ https://play.google.com/store/apps/details?id=in.gov.affcwc&pcampaignid=web_share లింక్‌ను క్లిక్‌ చేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు