Suresh Gopi: సినీ నటుడు సురేష్‌ గోపీకి త్రిశ్శూరులో ఘన స్వాగతం

సినీనటుడు సురేష్‌ గోపీ విజయంతో కేరళలో భాజపా తొలిసారి ఖాతా తెరవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Published : 05 Jun 2024 19:02 IST

త్రిశ్శూర్‌: కేరళలో భాజపా ఖాతా తెరవడంతో కాషాయ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. త్రిశ్శూర్‌ నుంచి భాజపా అభ్యర్థిగా సినీ నటుడు సురేష్‌ గోపీ గెలవడంతో భారీ రోడ్‌షో నిర్వహించారు. తిరువనంతపురం నుంచి బుధవారం ఆయన త్రిశ్శూరుకు రాగా.. పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. డప్పు నృత్యాలతో, బాణసంచా కాల్చుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్‌షోలో భాజపా నేతలు వి. మురళీధరన్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

కింగ్‌ మేకర్‌.. జాతీయ ఛానెళ్లలో చంద్రబాబుపై ఆసక్తికర కథనాలు

ఈ రోడ్‌ షోలో భాజపా కార్యకర్తలు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటో రిక్షాలపై కాషాయ జెండాను పట్టుకొంటూ ర్యాలీగా ముందుకు సాగారు. రాష్ట్రంలో కమలం వికసించిందంటూ నినాదాలు చేశారు. సురేష్‌ గోపీ ద్వారా కేరళలో కమల వికాసం కొనసాగుతుందని పేర్కొన్నారు. త్రిశ్శూరులో జరిగిన ఉత్కంఠ పోరులో సీపీఐ నేత వీఎస్‌ సునీల్‌ కుమార్‌పై సురేష్‌ గోపీ దాదాపు 70వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని