Republic Day: దౌత్యపరమైన వివాదం వేళ.. ‘రిపబ్లిక్‌ డే’ శుభాకాంక్షలు చెప్పిన కెనడా

భారత్‌ విషయంలో కెనడా (India-Canada) ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau) వ్యవహరిస్తోన్న తీరుతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా.. భారత్‌కు గణతంత్ర దినోత్సవ(Republic Day) శుభాకాంక్షలు చెప్పింది.

Updated : 26 Jan 2024 11:15 IST

దిల్లీ: భారత రిపబ్లిక్‌ డే (Republic Day) వేడుకలు శుక్రవారం దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు చెప్తున్నాయి. కెనడా(Canada) కూడా మనకు విషెస్ చెప్పింది. ‘భారత్‌కు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ దిల్లీలోని ఆ దేశ హై కమిషనర్‌ కార్యాలయం హిందీ, ఇంగ్లిష్‌లో పోస్టు పెట్టింది.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఎన్నికల్లో విదేశీ జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో భారత్‌ పేరు చేర్చి.. ట్రూడో ప్రభుత్వం ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది.

అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, ఫ్రాన్స్‌ తదితర దేశాల నుంచి మనకు రిపబ్లిక్‌ డే సందేశాలు అందాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని