₹51 లక్షల తన సేవింగ్స్‌ను విరాళంగా ఇచ్చేసిన సీఎం!

హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం తన మూడు సేవింగ్స్‌ ఖాతాల్లోంచి ₹51లక్షల మొత్తాన్ని విపత్తు సహాయ నిధికి విరాళంగా అందజేశారు.

Published : 15 Sep 2023 18:02 IST

శిమ్లా: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన హిమాచల్‌ ప్రదేశ్‌ను ఆదుకొనేందుకు పలు సంస్థలు, వ్యక్తులు విరాళాలు అందిస్తున్నారు. తమకు తోచినంత మేర విరాళాలు ఇస్తూ ఉదారతను చాటుకొంటున్నారు. అయితే, తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు తన మూడు వ్యక్తిగత సేవింగ్స్‌ ఖాతాల్లో ఉన్న డబ్బును విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ₹51లక్షల మొత్తానికి సంబంధించిన విరాళం చెక్కును తన సతీమణితో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. 

జాబిల్లిపై నీరు.. భూమి నుంచే: చంద్రయాన్‌-1 డేటా చెప్పిందిదే..!

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ఇదంతా నా వ్యక్తిగత సేవింగ్స్‌ నుంచి ఇస్తున్నా. విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేకమంది చిన్నారులు తమ పిగ్గీ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులను సహాయంగా అందించారు. అధికారులు, ఉద్యోగులు, పింఛను తీసుకొనే వృద్ధులు తమ శక్తి మేరకు విరాళాలు ఇచ్చారు. అందువల్ల నా మూడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును సేకరించి ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నా..’’ అని చెప్పారు. 

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన హిమాచల్‌ప్రదేశ్‌లో బాధితులకు సాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర విపత్తు సహాయ నిధికి సాధారణ ప్రజలు, పలు సంస్థలు ఉదారతతో సహకరించాలని గతంలో సీఎం విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తికి స్పందించిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులు ముందుకొచ్చి విరాళాలను విరివిగా అందిస్తున్నారు. చిన్నారులు సైతం తమ పిగ్గీ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకొని విపత్తు సహాయ నిధికి ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను సైతం విపత్తు సహాయ నిధికి తనవంతు సాయం చేయాలని భావించిన సీఎం తన సేవింగ్స్‌ నుంచి ₹51లక్షల మొత్తాన్ని అందజేయడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు