Voter enrollment: 15తో ముగియనున్న గడువు... ఓటు నమోదు చేసుకోండిలా!

సార్వత్రిక ఎన్నికల వేళ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు ఈసీ కల్పించిన అవకాశం ఈ నెల 15తో ముగియనుంది. ఓటు నమోదు చేసుకోనివారు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా ఓటు హక్కు పొందొచ్చు.

Updated : 14 Apr 2024 19:20 IST

New Voter Registration | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటరుగా నమోదుకు గడువు ఏప్రిల్‌ 15తో ముగియనుంది. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, 2006 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారు కొత్తగా ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేయించుకోవచ్చు. దీని కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేసి నేరుగా అప్లయ్‌ చేసుకోండి.. త్వరలో జరగబోయే ఓట్ల పండుగలో భాగస్వాములుకండి.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌/ అప్లయ్‌ చేసుకోండిలా.. 

  • కొత్త ఓటరుతో పాటు, ఓటరు జాబితాలో పేరు గల్లంతైనవారు, అర్హత ఉండి నేటికీ ఓటు హక్కు రాని వారందరూ కూడా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • మీ మొబైల్‌ నంబర్‌, ఇ-మెయిల్‌ అడ్రస్‌ (ఆప్షనల్‌) ఎంటర్‌ చేసి క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయండి 
  • మీ పేరు ఎంటర్‌ చేశాక.. నచ్చిన పాస్‌వర్డ్‌ పెట్టుకోండి. మీఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి
  • ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌/ఇ-మెయిల్‌ ఐడీ ఎంటర్‌ చేసి మీ పాస్‌వర్డ్‌ ఎంటర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేస్తే మళ్లీ మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్‌ చేయండి.
  • ఆ తర్వాత వచ్చే పేజీలో కొత్త ఓటరుగా నమోదు చేయించుకొనేందుకు ఫారం -6ను పూర్తి చేయండి. ఇందుకోసం పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో, అడ్రస్‌, పుట్టిన తేదీని ధ్రువీకరించే పత్రాలు ఉంటే సరిపోతుంది.
  • అక్కడ అడిగిన వివరాలు, డాక్యుమెంట్‌లను అప్‌లోడ్‌ చేయండి. అన్ని వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని సబ్మిట్‌ చేస్తే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. 
  • మీకు వచ్చిన రిఫరెన్స్‌ నంబర్‌, రాష్ట్రం పేరు ఈ లింక్‌పై ఎంటర్‌ చేసి మీ అప్లికేషన్‌ స్టేటస్‌ను కూడా ట్రాక్‌ చేసుకోవచ్చు.

మార్పులూ చేసుకోవచ్చు

ఇప్పటికే ఓటరు జాబితాలో పేరుండి నివాసం వారి ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి మార్చుకోవడానికి, కుటుంబ సభ్యులందరివీ ఒకే పోలింగ్‌ కేంద్రంలో లేకపోతే మార్చు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి వారందరూ ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికల వేళ అర్హులైన వారికి మరో అవకాశం కల్పిస్తూ ఈ నెల 15 వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన వారి వివరాలతో ఓటర్ల అనుబంధ జాబితాను ఈ నెల 25న ప్రకటిస్తారు. ఆ ప్రకారం మే 13 నాటి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని