ప్రకటనల స్థానంలో పోర్న్‌ క్లిప్‌.. మండిపడిన ప్రయాణికులు.. రైల్వే స్టేషన్‌లో ఘటన

రైల్వే స్టేషన్‌(Railway station) ప్లాట్‌ఫాం టీవీల్లో పోర్న్‌ క్లిప్‌ ప్రసారం కావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మహిళలు, పిల్లల ముందు ఇలా జరగడంతో ఆగ్రహంతో ఊగిపోయారు.

Updated : 20 Mar 2023 15:00 IST

పట్నా: రైలు(Train) కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. బిహార్‌(Bihar)లోని పట్నా రైల్వే స్టేషన్‌లో ఉన్న టీవీల్లో ఒక్కసారిగా పోర్న్‌ దృశ్యాలు ప్రసారం కావడం వారి మండిపాటుకు కారణం. ప్రకటనలు రావాల్సిన స్థానంలో ఆదివారం ఉదయం ఆ అసభ్యకర దృశ్యాలు మూడు నిమిషాలు ప్రసారం అయ్యాయి.

దీంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఆర్‌పీ సిబ్బంది చర్యలు తీసుకోవడం ఆలస్యం కావడంతో.. ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది స్పందించారు. అక్కడ ప్రకటనలు ప్రసారం చేసే కాంట్రాక్టు తీసుకున్న దత్తా కమ్యూనికేషన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ అసభ్య చిత్రాల ప్రసారాన్ని ఆపివేయాలని చెప్పారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన రైల్వే అధికారులు దత్తా కమ్యూనికేషన్స్‌పై చర్యలు ప్రారంభించారు. ఆ ఏజెన్సీని బ్లాక్‌ చేసి, జరిమానా విధించారు. కాంట్రాక్టును కూడా రద్దు చేసినట్లు సమాచారం. అలాగే ఆ వీడియోలు ప్రత్యేకించి ప్లాట్‌ఫాం నంబర్ 10 వద్ద ఉన్న టీవీల్లో ప్రసారం అయినట్లు అధికారులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని