CM Siddaramaiah: నేనే సీఎంగా ఉంటా! - సిద్ధరామయ్య

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తమ గురువు డీకే శివకుమార్‌ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లు కుణిగల్ ఎమ్మెల్యే సహా పలువురు పార్టీ నేతలు డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. వీటిపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah).. ఐదేళ్ల పదవీ కాలానికి తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
‘‘ఐదేళ్ల పదవీకాలానికి నేనే సీఎంగా ఉంటా. వచ్చే ఏడాది మైసూరు దసరా ఉత్సవాల్లోనూ పుష్పార్చన చేస్తాననే నమ్మకం ఉంది. అయితే, పార్టీ అధిష్ఠానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉండాల్సిందే’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలంటూ కాంగ్రెస్‌లో ఓ వర్గం డిమాండ్ చేస్తోందని అడిగిన ప్రశ్నకు సీఎం ఇలా స్పందించారు.
మా గురువు సీఎం కావాలి..
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి డీకే శివకుమార్ చేసిన కృషిని పార్టీ అధిష్ఠానం గుర్తించాలని కుణిగల్ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్ పేర్కొన్నారు. తన రాజకీయ గురువు డీకే శివకుమార్ అని.. సామాజిక సేవతో పాటు పాలనలోనూ ఆయన తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర పాలనా పగ్గాలను డీకేఎస్‌కు అప్పగించాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఓటర్లు ఇదే కోరుకుంటున్నారని, ఈ దిశగా అధిష్ఠానం కూడా నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


