Air Force: బలగాలకు మరింత భరోసా.. ‘హెవీ డ్రాప్‌ వ్యవస్థ’ ట్రయల్స్‌ సక్సెస్‌!

గగనతలం నుంచి భారీ సైనిక సామగ్రిని పారాచ్యూట్ల సాయంతో కిందికి జారవిడిచే ‘హెవీ డ్రాప్ సిస్టమ్‌’ను భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది.

Published : 20 Aug 2023 01:47 IST

దిల్లీ: సైనిక ఆపరేషన్స్‌లో లాజిస్టిక్స్‌ నిర్వహణ ఎంతో ముఖ్యం. క్షేత్రస్థాయిలోని బలగాలకు అవసరమైన ఆయుధాలు, వాహనాలు, ఇతర సామగ్రిని వేగంగా చేరవేయడం ఇందులో భాగం. ఈ క్రమంలోనే.. గగనతలం నుంచి పారాచ్యూట్ల సాయంతో భారీ సామగ్రిని కిందికి జారవిడిచే విధానంలో భారత వాయుసేన (IAF) మరింత పురోగతి సాధించింది. ఓ సరకు రవాణా విమానం సాయంతో సరికొత్త ‘హెవీ డ్రాప్ సిస్టమ్‌ (Heavy Drop system)’ను ఇటీవల విజయవంతంగా పరీక్షించింది. శనివారం ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది.

రతన్‌ టాటాకు ‘ఉద్యోగరత్న’ తొలి అవార్డు ప్రదానం

ఈ ‘హెవీ డ్రాప్‌ సిస్టమ్‌’ను ఆగ్రాలోని రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ప్రయోగశాల అభివృద్ధి చేసినట్లు వాయుసేన అధికారులు తెలిపారు. ఇక్కడి ‘ఏరియల్‌ డెలివరీ రీసెర్చీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (ADRDE)’ రూపొందించిన ఈ వ్యవస్థ ట్రయల్స్‌ను ఇటీవల విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా డీఆర్‌డీవోతో కలిసి వాయుసేన ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని