Satyapal malik: నాకేమైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత.. సత్యపాల్ మాలిక్
కేంద్రం తనకు Z+ కేటగిరీ భద్రతను కుదించిందని.. ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు.
దిల్లీ: తనకు కల్పించిన జెడ్ ప్లస్(Z+) కేటగిరీ భద్రతను ఉపసంహరించుకోవడంపై జమ్మూకశ్మీర్(Jammu kashmir) మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satyapal malik) కేంద్రంపై మండిపడ్డారు. తన భద్రతను కుదించి ఓ పర్సనల్ సెక్యూరిటీ అధికారి(పీఎస్‌వో)ని ఇచ్చినా.. అతడు మూడు రోజులుగా రాలేదన్నారు. ఎవరైనా తనపై దాడిచేయవచ్చని.. తనకేదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన పలు జాతీయ మీడియా సంస్థలతో మాట్లాడుతూ.. రైతు సమస్యలు, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ల విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడినందువల్లే తన భద్రతను తగ్గించారని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరాలని తనకు లేదని.. తాను రాజకీయ వ్యక్తిని కాదన్నారు. 2008 నుంచి 2018 వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన ఎన్‌ఎన్ వోరా వంటి వాళ్లకు భద్రత ఇప్పటికీ చెక్కుచెదరలేదన్నారు. తనకు ఎందుకు భద్రత కుదించారు? దీని వెనుక కారణాలేంటని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు లేఖ రాసినా ఇప్పటివరకు స్పందన రాలేదన్నారు.
తాను గవర్నర్‌గా ఉన్న సమయంలోనే జమ్మూకశ్మీర్ అసెంబ్లీ రద్దు చేశామని.. ఆర్టికల్ 370 రద్దు జరిగింది కూడా తన హయాంలోనేనన్నారు. సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్‌తో పాటు మేఘాలయా, గోవా గవర్నర్‌గానూ సేవలందించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కశ్మీర్, లద్ధాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సమయంలో సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ చారిత్రక నిర్ణయం జరిగిన నెల రోజులకు ఆయన గోవా గవర్నర్‌గా బదిలీ అయ్యారు. అలాగే, అక్టోబర్ 2022 వరకు ఆయన మేఘాలయ గవర్నర్‌గా సేవలందించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..
-
Sports News
Virat -Babar: ఆ ఒక్క క్వాలిటీనే వ్యత్యాసం.. అందుకే బాబర్ కంటే విరాట్ అత్యుత్తమం: పాక్ మాజీ ఆటగాడు
-
Crime News
Crime News: శంషాబాద్ విమానాశ్రయంలో కిలోకుపైగా విదేశీ బంగారం పట్టివేత
-
Movies News
Telugu Movies:ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Ap-top-news News
Andhra News: భూ పరిహారం నొక్కేసిన వైకాపా నేత
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు