Building Collapse: నాలుగంతస్తుల నివాస భవనం.. నిమిషాల వ్యవధిలో కుప్పకూలి!

దిల్లీలోని కల్యాణ్‌పురి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది.

Updated : 20 Apr 2024 22:38 IST

దిల్లీ: ఓ నాలుగంతస్తుల నివాస భవనం పేకమేడలా కుప్పకూలింది. దేశ రాజధాని దిల్లీ (Delhi)లోని కల్యాణ్‌పురిలో ఈ ఘటన (Building Collapse) చోటుచేసుకుంది. భవంతి ఒకవైపు ఒరిగినట్లు శనివారం స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది.. ముందుజాగ్రత్త చర్యగా నివాసితులను ఖాళీ చేయించారు.

మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్‌

పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు నిమిషాల వ్యవధిలోనే ఆ భవనం నేలమట్టమైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. శిథిలాలు పడటంతో సమీపంలోని ఇళ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. భవనం కూలుతోన్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించిన తవ్వకాల వల్లే భవనం కూలిపోయినట్లు యజమాని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని