Ashwini Vaishnaw: 10 ఏళ్లలో 31వేల కి.మీ రైల్వే మార్గం నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్

వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో కేంద్ర రేల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. దేశంలో రైల్వే వ్యవస్థలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు.

Updated : 18 May 2024 13:28 IST

దిల్లీ: ముంబయిలో జరిగిన వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్(Ashwini Vaishnaw) పాల్గొన్నారు. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. మోదీ(PM Modi) హయాంలో భారతీయ రైల్వేల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు పలు వివరాలను వెల్లడించారు. 

భారత రైల్వేలు భారీ స్థాయిలో నెట్‌వర్క్‌లను ఎలా కలిపాయి. ఏ విధంగా ఆధునీకరించాయో తెలిపారు. ఆయన మాట్లాడుతూ‘‘ప్రస్తుతం దేశంలో రోజుకు 4కి.మీ రైలు ట్రాక్‌ నిర్మిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు  5,300 కి.మీ రైళ్ల నెట్‌వర్క్‌ను నిర్మించాము. ఇది స్విట్జర్లాండ్‌లోని మొత్తం రైళ్ల నెట్‌వర్క్‌కు సమానం. పది ఏళ్లుగా 31,000 కి.మీ. ట్రాక్‌ను ఏర్పాటు చేశాము. ఇప్పుడు ఈ రైల్వే లైను జర్మనీ(germany)లో మొత్తంలో ఉన్న పూర్తి నెట్‌వర్క్‌కు సమానం’’అని ఆయన వివరించారు. 

గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 20,000 కిలోమీటర్ల  మార్గాలను మాత్రమే నిర్మించిందని కాగా పదేళ్ల పాలనలో కేంద్రం 44,000 కిలోమీటర్ల రైల్వేనెట్‌వర్క్‌లకు విద్యుత్‌ సదుపాయాలు కల్పించిందని తెలిపారు. నేడు మనం రైల్వేల్లో 100 శాతం విద్యుదీకరణ దిశగా పయనిస్తున్నామన్నారు.

‘‘దేశంలో అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ  రైల్వేలు గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి చెందకుండా మిగిలిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే అభివృద్ధి మొదలయ్యింది’’అని ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ,ఆధునిక రైళ్ల తయారీ గురించి వివరించారు.

దేశవ్యాప్తంగా 300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి జరిగిందన్నారు. కేవలం మహారాష్ట్రలోనే 120 స్టేషన్లు ఉన్నాయని, శివాజీ మహారాజ్ రైల్వే స్టేషన్ అత్యాధునిక సౌకర్యాలున్న స్టేషన్‌కు ఉదాహరణ అని పేర్కొన్నారు.  వందే భారత్ , బుల్లెట్ రైళ్లు దేశంలోని రైల్వేలో వస్తున్న అత్యాధునిక మార్పులను సూచిస్తున్నాయన్నారు. ‘‘టెలికాం సేవల్లో భారతదేశం గ్లోబల్ హబ్‌గా ఆవిర్భవించనుంది. రాబోయే తరాలు మార్పును చూస్తాయి. గత ప్రభుత్వ హయాంలో దేశంలో మొబైల్ తయారీ అనేదే లేదని, నేడు భారత్‌ మొబైల్ తయారీ, ఎగుమతిలో ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. ఆపిల్ సంస్థ ఏప్రిల్‌లో 8,500 కోట్ల విలువైన ఫోన్‌లను ఎగుమతి చేసిందని, ఇకపై మరింతగా అభివృద్ధి చెందుతుందని ’’అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు