IT raids: వీడియోలతో ₹కోటి సంపాదించిన యూట్యూబర్‌ ఇంటిపై ఐటీ దాడులు

యూట్యూబ్‌ వీడియోలు చేసి ₹కోటికి పైగా సంపాదించిన ఓ యూట్యూబర్‌ ఇంటిపై ఐటీశాఖ అధికారులు దాడి చేశారు. 

Updated : 17 Jul 2023 22:29 IST

లఖ్‌నవూ: యూట్యూబ్‌ వీడియోలు చేయడం ద్వారా రూ.కోటికి పైగా ఆదాయం సంపాదించిన ఓ యూట్యూబర్‌ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన తస్లీమ్‌ అనే యూట్యూబర్‌ ఇంట్లో రూ.24లక్షలు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. తస్లీమ్ కొన్నేళ్లుగా ఓ యూట్యూబ్ ఛానల్‌ నిర్వహిస్తున్నాడని.. దాదాపు రూ.కోటికి పైగా సంపాదించినట్టు పేర్కొన్నారు. అయితే, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా ఇంత మొత్తాన్ని సంపాదించాడని అధికారులు ఆరోపించగా..  అతడి కుటుంబ సభ్యులు వాటిని తోసిపుచ్చారు. 

మ్యాగీ నూడుల్స్‌ ప్లేట్‌కు ₹193.. వైరలవుతున్న ట్వీట్‌..

షేర్‌ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలు చేసే తస్లీమ్‌ తనకు వచ్చిన ఆదాయంపై పన్ను కూడా చెల్లించాడని అతడి సోదరుడు తెలిపారు. యూట్యూబ్‌ ద్వారా సంపాదించిన రూ.1.2కోట్ల మొత్తానికి ఇప్పటికే రూ.4లక్షల పన్ను చెల్లించాడని వివరించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని.. యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించడం ద్వారా తాము మంచి ఆదాయం  పొందుతున్నట్టు  వివరించారు. ఇదే నిజమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐటీ దాడులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న కుట్ర అన్నారు. మరోవైపు, ఈ దాడులపై తస్లీమ్‌ తల్లి కూడా స్పందించారు. తన కుమారుడిని కావాలనే కేసులో ఇరికిస్తున్నారంటూ వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని