Kharge: ఇండియా కూటమికి 295కు పైగా సీట్లు ఖాయం: ఖర్గే

లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కు పైగా సీట్లు సాధిస్తుందని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. 

Published : 01 Jun 2024 19:43 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ (Congress) జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇండియా కూటమి (INDIA bloc) 295కు పైగా సీట్లు గెలుచుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిలోని కీలక నేతలతో తన నివాసంలో భేటీ అయిన ఖర్గే ఎన్నికలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి 295కు పైగా స్థానాలు గెలుచుకుంటుంది. ఫలితాల్లోనూ ఇదే వెల్లడవుతుంది. మా కూటమిలోని నేతలు ప్రజల్లోకి వెళ్లి సర్వే నిర్వహించారు. వారితో రెండు గంటలకు పైగా చర్చలు జరిపాం. సర్వే ప్రకారం ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాం. ముఖ్యంగా కౌంటింగ్‌ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అన్ని పార్టీలు తమ కార్యకర్తలకు సూచనలు ఇవ్వాలని నిర్ణయించాం. మేము ప్రజలకు వాస్తవాలను చెప్పాలనుకుంటున్నాం’’ అని ఖర్గే పేర్కొన్నారు.

లైంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!

ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, రాఘవ్‌ చద్దా, చంపాయి సోరెన్‌ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. మరోవైపు.. చివరిదశలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండడంతో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ఈ భేటీకి హాజరుకాలేకపోయినట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని