PM Modi: గుజరాత్‌లో లక్షన్నర మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం: మోదీ

యువతకు నైపుణ్యం కల్పించడం ద్వారానే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా వెళ్తున్నట్టు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. గుజరాత్‌లో రోజ్‌గార్‌ మేళాలో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.

Updated : 06 Mar 2023 18:57 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌(Gujarat)లో గత ఐదేళ్ల వ్యవధిలో లక్షన్నర మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) తెలిపారు. సోమవారం ఆయన గుజరాత్‌ రోజ్‌గార్‌ మేళాలో వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు.  యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా భారత్‌ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యాన్ని చేరుకోగలమని చెప్పారు. గతేడాది ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలొ వివిధ రంగాల్లో పెరుగుతోన్న అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు  వీలుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కి చెప్పారు.  

తన సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో గత కొన్నేళ్లుగా ఎంప్లాయిమెంట్‌ ఎక్ఛేంజీల ద్వారా దాదాపు 18లక్షల మంది ఉద్యోగాలు పొందారన్నారు.  గత ఐదేళ్లలోనే 1.5లక్షల మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన విషయాన్ని వెల్లడించారు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 2500 మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతకు ఈ సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేళాలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని