IMD: తెలుగు రాష్ట్రాల్లో ఈసారి వడగాలులు ఎక్కువే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్ణాటకతోపాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీయవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

Published : 01 Mar 2024 17:51 IST

దిల్లీ: ఈ ఏడాది వేసవి కాలం భానుడి మంటలతోనే మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఎల్‌నినో (El Nino) ప్రభావంతో ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీయవచ్చని తెలిపింది.

మార్చి-మే మధ్యకాలంలో దేశంలో అనేకచోట్ల సాధారణం కంటే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణశాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మోహపాత్ర వెల్లడించారు. ఉత్తర, మధ్య భారత్‌లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చన్నారు. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం వేసవివరకూ ఉండే అవకాశం ఉందని..ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్నారు.

చట్టసభ సభ్యుల శరీరాల్లో ‘చిప్‌’ పెట్టలేం..! పిటిషనర్‌కు సుప్రీం మందలింపు

మరోవైపు దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లా నినా (La Nina) పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా. దేశంలో మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇదిలాఉంటే, ఏప్రిల్‌-మేలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని