Amit Shah: గత పదేళ్లలో 53 కోట్ల బ్యాంకు ఖాతాలు - అమిత్‌ షా

Eenadu icon
By National News Team Published : 25 Sep 2025 23:00 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఇటీవల బ్యాంకింగ్‌ రంగంలో గణనీయమైన సంస్కరణలు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) పేర్కొన్నారు. దాని పునాదులు బలోపేతం చేయడానికి 86 కీలక చర్యలు అమలు చేశామని, తద్వారా మరింత దృఢంగా మార్చే ప్రయత్నం చేశామన్నారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా.. 2014 తర్వాత దేశవ్యాప్తంగా 53 కోట్లకుపైగా ఖాతాలు తెరిచినట్లు చెప్పారు.

‘‘2014 తర్వాత ప్రధాని మోదీ నాయకత్వంలో బ్యాంకింగ్‌ రంగంలో కీలక సంస్కరణలు చేపట్టాం. అంతకుముందు 60 కోట్ల మంది భారతీయులకు వారి కుటుంబంలో ఒక్క బ్యాంకు అకౌంటు కూడా లేదు. ఈ దశాబ్ది కాలంలో వీరిని బ్యాంకింగ్‌ రంగంలోకి తీసుకొచ్చాం. నిర్మాణాత్మక సంస్కరణలు, డిజిటల్‌ గవర్నెన్స్‌, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడం ద్వారా దేశం అద్భుత ప్రగతి సాధిస్తోంది.

యూపీఐ, ఫిన్‌టెక్‌ ద్వారా డిజిటల్‌ విప్లవం మొదలైంది. కోట్లాది లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపు 7 దేశాలు యూపీఐను ఆమోదించాయి. డిజిలాకర్‌ను 52 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలతో పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేశాం. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధిరేటు ఒకటి నుంచి రెండు శాతం ఉండగా.. భారత్‌ మాత్రం 7-8 వృద్ధిరేటుతో దూసుకెళ్తోంది. అంతర్జాతీయ అనిశ్చితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటకీ ఎఫ్‌డీఐలు 14శాతం పెరిగాయి’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు