IndiGo: ల్యాండింగ్‌కు ముందు పైలట్‌ కళ్లకు లేజర్‌ లైట్‌.. తర్వాత ఏం జరిగిందంటే..

విమాన ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు పైలట్‌పై లేజర్‌ లైట్ ప్రయోగం జరిగింది. ఈ ఘటనపై ఇండిగో ఆందోళన వ్యక్తం చేసింది. 

Updated : 25 Feb 2024 13:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విమాన ల్యాండింగ్‌కి ముందు పైలట్‌ కళ్లలో లేజర్‌ కిరణాలు పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇండిగోకు చెందిన ఓ విమానంలో చోటు చేసుకొంది. దీనిపై ఎయిర్‌లైన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అసలేం జరిగిందంటే..

6E 223 విమానం శుక్రవారం బెంగళూరు నుంచి కోల్‌కతాకు బయలుదేరింది. దీనిలో ఆరుగురు సిబ్బంది సహా 165 మంది ప్రయాణికులు ఉన్నారు. సాయంత్రం 7. 30 గంటలకు విమానం ల్యాండ్‌ కావాల్సి ఉంది. కిలోమీటర్ల దూరంలో ఉండగా.. లేజర్‌ కాంతి కిరణాలు సరిగ్గా కాక్‌పిట్‌లోని పైలట్‌ కళ్లను తాకాయి. దీంతో పైలట్ కళ్లు కాసేపు మసకబారాయి. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. లేజర్‌ కాంతి కారణంగా చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది.

పైలట్‌పై జరిగిన చర్యపై ఇండిగో ఆందోళన వ్యక్తం చేస్తోంది. తక్షణమే బిధాన్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. విమాన ప్రమాదాలు, లేజర్‌ లైట్ల సమస్యలపై గత వారం ఎయిర్‌పోర్ట్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ల్యాండింగ్‌, పైలట్‌లపై లేజర్‌ ప్రయోగాన్ని నివారించేందుకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌ చుట్టూ 18.5 కిలోమీటర్ల మేర నిషేధిత జోన్‌గా ప్రకటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని