iPhone: హుండీలో జారిపడ్డ ఐఫోన్‌.. ‘దేవుడి ఖాతాలోకే’..!

Eenadu icon
By National News Team Updated : 21 Dec 2024 17:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడులోని ఓ ఆలయంలో అనూహ్యమైన ఘటన చోటుచేసుకుంది. దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి ఐ ఫోన్‌ (iPhone) జారి అందులో పడింది. అయితే హుండీలో పడిన ఏ వస్తువైనా దేవుడి ఖాతాలోకే వెళ్తుందని..దానిని తిరిగి ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పడంతో కంగుతినడం అతడివంతయ్యింది. అసలేమయ్యిందంటే..

తమిళనాడులోని వినయగపురానికి చెందిన దినేష్ అనే వ్యక్తి తిరుపోరూరులోని కందస్వామి ఆలయానికి వెళ్లారు. దేవుడి హుండీలో డబ్బులు వేస్తుండగా అతడి జేబులో ఉన్న ఐఫోన్‌ అనుకోకుండా హుండీలో పడిపోయింది. ఈ విషయాన్ని అతడు గుడి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి తన ఫోన్‌ ఇప్పించమని కోరారు. అయితే ఫోన్‌ హుండీలో పడింది కాబట్టి ఇప్పుడు అది ఆలయ ఆస్తి కిందికి వస్తుందని పేర్కొంటూ అధికారులు అతడి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్‌ను తిరిగి ఇచ్చేది లేదని, డేటా మాత్రం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. దీంతో అతడు ఏమీ చేయలేక తిరిగి వెళ్లి.. హిందూ రిలీజియస్‌ అండ్‌ ఛారిటబుల్‌ ఎండోమెంట్‌ (హెచ్‌ఆర్‌ అండ్‌ సీఈ) అధికారులకు, స్థానిక మంత్రి శేఖర్‌ బాబుకు ఫిర్యాదు చేశారు. కాగా హుండీలో జమచేసిన వస్తువు దేవుడి ఖాతాలోకి వెళ్తుందని, తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని మంత్రి చెప్పడం గమనార్హం.

Tags :
Published : 21 Dec 2024 17:02 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు