
Malaysia PM: మలేసియాకు నూతన ప్రధాని.. ఎవరంటే?
కౌలాలంపూర్: మలేసియా నూతన ప్రధానిగా ఇస్మాయిల్ సబ్రి యాకొబ్(61) నియమితులయ్యారు. ఆ దేశ రాజు అల్- సుల్తాన్ అబ్దుల్లా ఆయన్ను ఈ పదవికి నియమించినట్లు రాజభవనం వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. శనివారం ఆయన ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపాయి. ఇటీవల పార్లమెంటులో బలనిరూపణలో విఫలమైన నేపథ్యంలో ముహిద్దీన్ యాసిన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా నియామకం చేపట్టారు.
కొవిడ్ కట్టడి సవాల్..
యాకొబ్.. యునైటెడ్ మలేస్ నేషనల్ ఆర్గనైజేషన్(యూఎంఎన్‌వో) పార్టీకి చెందిన నేత. ముహిద్దీన్ కేబినెట్‌లో రక్షణశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా విధులు నిర్వహించారు. 2018 ఎన్నికల తర్వాత ఈయన మూడో ప్రధాని కావడం గమనార్హం. కొవిడ్ కట్టడి, ఆర్థిక మాంద్యం ప్రస్తుతం ఆయన ముందు ఉన్న పెద్ద సవాళ్లని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా నియంత్రణలో విఫలమైందని గత ప్రభుత్వం ప్రజల నుంచి విమర్శలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.