‘రాఖీ సావంత్ నేనున్నా కదా!’ ఇజ్రాయెల్ ఎంబసీ ఫన్నీ ఆన్సర్.. దేనిగురించి అంటే..?

ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు భారత్‌ పట్ల తమకున్న ఇష్టాన్ని ప్రదర్శించారు. అలాగే నటి రాఖీ సావంత్‌ను ఉద్దేశించి సరదాగా స్పందించారు. 

Published : 14 Mar 2024 12:46 IST

దిల్లీ: ‘వాట్స్ రాంగ్ విత్ ఇండియా’ (What's wrong with India) హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. భారత్‌ను ప్రతికూలంగా చిత్రీకరిస్తూ మొదలైన ఈ ట్రెండ్‌కు కొందరు పాజిటివ్‌గా కౌంటర్‌ ఇస్తున్నారు. దీనిపై కొద్దిగంటల క్రితం ఇజ్రాయెల్ ఎంబసీ(Israel Embassy) షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

కొద్దిరోజుల క్రితం స్పెయిన్‌కు చెందిన టూరిస్ట్‌పై ఝార్ఖండ్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. దాంతో కొందరు విదేశీయులు మనదేశాన్ని నెగెటివ్ కోణంలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దాంతో ‘వాట్స్ రాంగ్ విత్ ఇండియా’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దానిపేరిటే.. దేశం సాధించిన విజయాలు, పురోగతిని  భారతీయులు ప్రస్తావిస్తున్నారు. వీరికి తాజాగా భారత్‌లోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం తోడైంది. హ్యాష్‌ట్యాగ్ గురించి ఇజ్రాయెల్‌ రాయబారి నవోర్‌ గిలాన్‌, ఇతర సిబ్బందిని ఓ వ్యక్తి ప్రశ్నించిన వీడియోను షేర్ చేసింది. దౌత్యసిబ్బంది మాట్లాడుతూ మనదేశ విజయాలు, సంస్కృతులు, ఆహారం వంటివాటి గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు.

‘మీ ల్యాండర్(Chandrayaan-3)  జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపింది.. పర్యటించేందుకు ఎన్నో అందమైన ప్రదేశాలున్నాయి.. జిలేబీ లాంటి నోరూరించే పదార్థాలు, వినేందుకు మధురమైన పాటలు ఉన్నాయి.. చూడాల్సిన సినిమాలు ఎన్నెన్నో’ అంటూ ఒక్కొక్కరు తమకు నచ్చినవాటి గురించి వెల్లడించారు. చివర్లో ఒక అధికారి మాత్రం ‘రాఖీ సావంత్’ పేరు చెప్పి కాస్త ఫన్నీగా మాట్లాడారు. ఆమె ఫొటోలను చూపిస్తూ.. మీరు అదిల్‌ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు..? నేనిక్కడే ఉన్నాను’ అంటూ చమత్కరించారు. అదిల్‌ ఖాన్.. రాఖీ మాజీ భర్త. ఇక, ఆ వీడియో చివర్లో భారత్‌లో అంతా బాగుంది అనే అర్థం వచ్చేలా IsraellovesIndia అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని