IT Raids: జ్యువెలరీ దుకాణంలో ఐటీ సోదాలు.. ₹26 కోట్లు నగదు సీజ్‌!

నాసిక్‌లోని ఓ జ్యువెలరీ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు జరిపి భారీగా నగదు సీజ్‌ చేశారు.

Published : 26 May 2024 23:44 IST

నాసిక్‌: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ జ్యువెలరీ సంస్థపై ఐటీ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. లెక్కల్లో చూపని రూ.26 కోట్ల నగదును సీజ్‌ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆభరణాల కంపెనీ, దాని ప్రమోటర్లు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో దాదాపు రూ.26 కోట్ల నగదును ఇప్పటివరకు సీజ్‌ చేసినట్లు సమాచారం. దీంతో పాటు బహిర్గతం చేయని పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పత్రాలను సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. గత వారం ఆగ్రాలో కూడా ఇదే తరహా దాడులు జరిగాయి. ఓ షూ వ్యాపారి, కొన్ని అనుబంధ సంస్థలపై దాడులు జరిపిన ఐటీ అధికారులు.. రూ.57 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని