PM Modi: జపాన్ చేరుకున్న ప్రధాని మోదీ.. పాక్‌తో సంబంధాలపై ఏమన్నారంటే!
పాకిస్థాన్‌తో సాధారణ, పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ మేరకు మాట్లాడారు. ఉగ్రవాదం, వైషమ్యాలు లేని వాతావరణాన్ని సృష్టించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాక్‌పైనే ఉందన్నారు.
దిల్లీ: పాకిస్థాన్ (Pakistan)తో సాధారణ, పొరుగు సంబంధాలను కోరుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పష్టం చేశారు. అయితే.. ఉగ్రవాదం, వైషమ్యాలు లేని వాతావరణాన్ని సృష్టించి, ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పైనే ఉందని పేర్కొన్నారు. జీ7 సదస్సు (G7 Summit)లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జపాన్ (Japan)కు బయల్దేరిన వేళ ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ప్రతిష్ఠను కాపాడుకునే అంశానికి కట్టుబడి ఉందని, ఈ మేరకు పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా చైనాతో సంబంధాలపైనా (India- China Relations) కీలక వ్యాఖ్యలు చేశారు.
‘చైనాతో సాధారణ సంబంధాలకుగానూ సరిహద్దు ప్రాంతాల్లో శాంతి స్థాపన చాలా అవసరం. ఆ దేశంతో తమ సంబంధాలు.. పరస్పర గౌరవం, ప్రయోజనాలపైనే ఆధారపడి ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య సానుకూల సంబంధాలు ఈ ప్రాంతానికి, ప్రపంచానికీ ప్రయోజనం చేకూరుస్తాయి’ అని ప్రధాని మోదీ అన్నారు. రష్యా- ఉక్రెయిన్ వివాదంలో భారత్ మధ్యవర్తి పాత్ర పోషించగలదా అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఈ విషయంలో భారత్ మొదటినుంచి శాంతిస్థాపన వైపు నిలుస్తోందని గుర్తుచేశారు. రష్యా, ఉక్రెయిన్.. రెండింటితో సంప్రదింపులు కొనసాగిస్తామని చెప్పారు. ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు ఇక్కట్లు ఎదుర్కొంటున్నవారికి మద్దతు ఇస్తామన్నారు.
ఇదిలా ఉండగా.. జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ శుక్రవారం అక్కడి హిరోషిమాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జపాన్ ప్రతినిధులు, భారత దౌత్యవేత్తలు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలు.. జపాన్, భారత్‌లను మరింత దగ్గర చేశాయని అన్నారు. జీ7 సదస్సులో ‘గ్లోబల్ సౌత్’ గొంతుకను వినిపించడంతోపాటు ఇంధనం, డిజిటల్ టెక్నాలజీ, సరఫరా గొలుసుల వంటి రంగాల్లో మార్పులు, సవాళ్లను చర్చించడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 2003 నుంచి జీ7 సదస్సులో భారత్ పాల్గొంటోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం
-
Politics News
Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను