javed ahmed: హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది జావేద్‌ అహ్మద్‌ అరెస్టు

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది జావేద్‌ అహ్మద్‌ మట్టోను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 04 Jan 2024 18:52 IST

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో (Jammu Kashmir) ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది జావేద్‌ అహ్మద్‌ మట్టోను (Javed Ahmed Mattoo) దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం మాటువేసిన స్పెషల్‌ సెల్ పోలీసులు (Delhi Special Cell Police) అతడిని అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్‌ లోయలో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేయడమే కాకుండా.. కీలక ప్రాంతాల్లో దాడులకు పన్నాగం పన్నుతున్నాడన్న ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. భద్రతా సంస్థల దగ్గరున్న మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో జావేద్‌ ఒకడు. ఇతడిపై కేంద్రం రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని