Karnataka: నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. 10ఏళ్ల వరకు జైలు, రూ.10కోట్ల జరిమానా!

ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలు, అవినీతి కార్యకలాపాలను పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించడం వంటి ప్రతిపాదనలతో కూడిన బిల్లును కర్ణాటక ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

Published : 06 Dec 2023 23:14 IST

బెళగావి: ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలు, అవినీతి కార్యకలాపాలను కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. ఇందులో భాగంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించడం వంటి ప్రతిపాదనలను అందులో పొందుపరిచింది.

కర్ణాటక పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (అవినీతి, అక్రమ మార్గాల నివారణ చర్యలు) బిల్లు-2023 పేరుతో అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్వయం ప్రతిపత్తి సంస్థలు, వివిధ బోర్డులు, కార్పొరేషన్ల నియామకాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, నియామకం కోసం అక్రమ మార్గాలను ఎంచుకోవడం, అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు ఉంటాయని అందులో ప్రతిపాదించింది. నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.10కోట్ల జరిమానా వంటి చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. వీటితోపాటు ఆస్తులను జప్తు చేసే అవకాశం కూడా ఉందని అందులో పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు