Ayodhya: అయోధ్యలో కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌.. బాలరాముడిని దర్శించుకున్న సీఎంలు

ఆప్‌ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal), భగవంత్ సింగ్ మాన్‌(Bhagwant Mann) నేడు అయోధ్యలో పర్యటించారు. 

Updated : 12 Feb 2024 17:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సోమవారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్(Bhagwant Mann) కూడా వెళ్లారు. వీరిద్దరూ కుటుంబసమేతంగా ఆ నగరంలో పర్యటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను కేజ్రీవాల్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్ చేశారు.

‘‘కుటుంబసభ్యులతో కలిసి ఈ రోజు అయోధ్య వెళ్లిన నాకు రామ్‌లల్లాను దర్శించుకునే భాగ్యం కలిగింది. మాతోపాటు భగవంత్‌జీ, ఆయన కుటుంబం కూడా అయోధ్యలో పర్యటించారు. దేశ పురోగతి, మానవాళి సంక్షేమం కోసం మేమంతా ప్రార్థించాం. శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. జై శ్రీరామ్’’ అని పోస్టు పెట్టారు.

అయోధ్య రాముడి సన్నిధిలో యోగి, 325 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తాను హాజరుకానని అప్పుడు కేజ్రీవాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘‘ప్రారంభోత్సవానికి ట్రస్ట్‌ వారు నాకు లేఖ పంపారు. నన్ను అధికారికంగా ఆహ్వానించడానికి ఒక బృందం వస్తుందని చెప్పారు. కానీ ఎవరూ రాలేదు. అయినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని చెప్పారు. మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక అంశాలపై  గౌరవం ఉందని, ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయడం సరికాదని భాజపాను దుయ్యబట్టారు. జనవరి 22 తర్వాత సమయం చూసుకుని తాను కుటుంబంతో కలిసి అయోధ్యను దర్శిస్తానని కేజ్రీవాల్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు