Kejriwal: అలా చేసుంటే కేజ్రీవాల్‌ అరెస్టయ్యేవారు కాదేమో: హిమంత బిశ్వశర్మ

Kejriwal: కేజ్రీవాల్‌కు ఈడీ 9 సార్లు సమన్లు పంపిందని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ గుర్తుచేశారు. వాటిని బేఖాతరు చేసి ఆయన తన అరెస్టును తానే కోరి తెచ్చుకున్నారని అన్నారు.

Updated : 24 Mar 2024 11:50 IST

గువాహటి: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) పంపిన సమన్లను బేఖాతరు చేయడం వల్లే మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టయ్యారని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) అన్నారు. తద్వారా అరెస్టును తానే కోరితెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా సానుభూతి పొందడం కోసమే అలా చేసి ఉంటారని ఆరోపించారు.

ఈడీ పంపిన తొమ్మిది వరుస సమన్లను ఒక వ్యక్తి స్పందించకపోవడం అంటే కావాలనే అరెస్టును ఆహ్వానిస్తున్నారనే అర్థం వస్తుందని బిశ్వశర్మ అన్నారు. కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తొలి సమన్లకే స్పందించి ఉంటే బహుశా అరెస్టయ్యి ఉండేవారు కాదేమోనని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బిశ్వశర్మ కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీని ప్రస్తావించారు. సమన్లు వచ్చిన వెంటనే వారిద్దరూ ఈడీ ముందు హాజరయ్యారని గుర్తుచేశారు. కానీ, కేజ్రీవాల్ దానికి విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. ఇది స్పష్టంగా రాజకీయ సానుభూతి కోసమే చేసినట్లు స్పష్టమవుతోందన్నారు.

జైలు నుంచే కేజ్రీవాల్‌ పాలన సాగిస్తారా?

మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను (Kejriwal) ఈడీ శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని