Sinitha Kejriwal: నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్‌ సతీమణి ఆరోపణలు

అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు.

Published : 28 Mar 2024 18:05 IST

దిల్లీ: మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఆరోగ్యంపై ఆయన సతీమణి సునీత ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు ఈడీ అధికారులు తీసుకురాగా.. అక్కడికి వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు. తన భర్త ఆరోగ్యం బాగా లేదని.. చక్కెరస్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈడీ అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ దౌర్జన్యం ఎంతోకాలం సాగదని, ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!

మరోవైపు, కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ నేటితో ముగియగా.. ఆయన్ను ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ అధికారులు మరో ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. జడ్జి నాలుగు రోజుల కస్టడీకి అనుమతించారు. తిరిగి ఏప్రిల్‌ 1న హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో కేజ్రీవాల్‌ ఏప్రిల్‌ 1వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని