Kunal Kamra: అరెస్టు నుంచి రక్షణ కల్పించండి.. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కుణాల్ కామ్రా

ఇంటర్నెట్ డెస్క్: అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని స్టాండప్ కమెడియన్ కుణాల్ కామ్రా (Kunal Kamra) మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంలో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ కేసులు మహారాష్ట్రలో నమోదైనప్పటికీ అతడు తమిళనాడుకు చెందినవాడు కావడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
ఇటీవల ముంబయిలో కుణాల్ కామ్రా హాస్య వినోద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో శిందేను ‘‘గద్దార్’’ (ద్రోహి)గా పేర్కొంటూ ఓ పేరడీ పాటను ఆలపించడం ఈ వివాదానికి కారణమైంది. ఉప ముఖ్యమంత్రిపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న కారణాన్ని చూపుతూ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కార్యక్రమం వేదికపై శివసేన కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై ఇటీవల స్పందించిన ఏక్‌నాథ్ శిందే.. కామ్రా వ్యాఖ్యలు ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ‘సుపారీ’ తీసుకున్నట్లు ఉన్నాయన్నారు. వాక్ స్వాతంత్ర్యానికి, వ్యంగ్యానికి ఓ హద్దు ఉంటుందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేశ్ పోస్టు
 - 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 


