Prashant Kishor: తేజస్వీని బిహార్‌కు రాజును చేయాలని లాలూ ఉబలాటం: ప్రశాంత్‌ కిశోర్‌

Eenadu icon
By National News Team Updated : 05 Jun 2025 13:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌ (Bihar)లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) విమర్శలు గుప్పించారు. 9వ తరగతి కూడా పాస్‌ కాని తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav)ను బిహార్‌కు రాజును చేయాలని లాలూ ఉబలాటపడుతున్నారన్నారు.  

బిహార్‌లోని సరన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కిశోర్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజలంతా తమ పిల్లలను ఎలా చూసుకోవాలో లాలూప్రసాద్‌ యాదవ్‌ నుంచి నేర్చుకోవాలి. ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ 9వ తరగతి కూడా పాస్‌ కాలేదు. లాలూ తన కుమారుడి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. తేజస్వీని బిహార్‌కు రాజును చేయాలని తెగ ఉబలాటపడుతున్నారు. మేము ఇలా మాట్లాడుతుంటే.. ఆయన్ను విమర్శిస్తున్నామని ప్రజలు అంటున్నారు. కాదు, మేము ఆయన్ను ప్రశంసిస్తున్నాం. సామాన్య ప్రజల పిల్లలు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినా.. వారికి ఉద్యోగాలు రావడం లేదు’ అని కిశోర్‌ పేర్కొన్నారు.

ఈసందర్భంగా రాష్ట్రంలో నిజమైన మార్పు చూడాలనుకునే ప్రజల ఆకాంక్ష రోజురోజుకు పెరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అవినీతితో సామాన్యులు విసిగిపోయారని, మార్పును బలంగా కోరుకుంటున్నారన్నారు. 

Tags :
Published : 05 Jun 2025 13:10 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని