భూ కుంభకోణం కేసు.. లాలూ ప్రసాద్, తేజస్వీకి ఈడీ సమన్లు

దిల్లీ: ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం సమన్లు జారీ చేసింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసులో ఇద్దరి వాదనలు రికార్డు చేసేందుకు.. తేజస్వీ ఈ నెల 22న, లాలూ ప్రసాద్ 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీలతో సన్నిహిత సంబంధాలున్న వ్యాపారవేత్త అమిత్ కత్యాల్‌ను గత నెలలో ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటికే తేజస్వీ యాదవ్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ విచారించింది. తాజాగా మరోసారి లాలూ ప్రసాద్‌తోపాటు ఆయనకు సమన్లు జారీ చేసింది.
2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభియోగాలు నమోదుచేసింది. ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. ఈ ఏడాది మార్చిలో దిల్లీ, బిహార్, ముంబయిలో మొత్తం 25 చోట్ల సోదాలు చేపట్టింది. తేజస్వీ నివాసంతో పాటు లాలూ కుమార్తెలు, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు జరిపింది.
పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలు.. తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 



