Viral Video: పాక్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన చిరుత.. సరిహద్దు గ్రామాల్లో కలకలం!

పాకిస్థాన్‌లో నుంచి భారత సరిహద్దుల్లోకి ఓ చిరుత పులి ప్రవేశించిన వీడియో వైరల్‌గా మారింది.

Published : 19 Mar 2023 18:49 IST

జమ్మూ: పాకిస్థాన్‌(Pakistan) సరిహద్దుల నుంచి ఓ చిరుత పులి(Leopard) భారత్‌లోకి చొరబడటం కలకలం రేపుతోంది. జమ్మూకశ్మీర్‌(Jammu kashmir)లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఇది ప్రవేశించినట్టు పోలీసులు వెల్లడించారు. బీఎస్‌ఎఫ్‌(BSF) బోర్డర్‌ అవుట్‌ పోస్ట్‌ నర్సరీకి సమీపంలో ఉన్న ఫెన్సింగ్‌ను దాటుకుంటూ ఓ చిరుత మన సరిహద్దుల్లోకి ప్రవేశించడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది.  బీఎస్‌ఎఫ్‌ నుంచి సమాచారం అందడంతో అన్ని బోర్డర్‌ పోలీస్‌ పోస్టులను అప్రమత్తం చేశారు. ఆయా ప్రాంతాల్లోని స్థానికులను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరీ ముఖ్యంగా రాత్రి పూట ఇంకా జాగ్రత్తగా ఉండలని విజ్ఞప్తి చేసినట్టు అధికారులు తెలిపారు.

వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు ఆ చిరుతను పట్టుకొనేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు,  స్థానికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని నర్సరీ పోస్ట్ సమీపంలోని కేసో, బరోట్టా, లగ్వాల్, పఖారీ, పరిసర గ్రామాలకు పోలీసు బృందాలను తరలించినట్టు అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని