BJP: ఒడిశా విజయం.. 13 రాష్ట్రాల్లో అధికారంలో భాజపా

ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దేశంలో భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 13కు చేరుకుంది.

Published : 05 Jun 2024 00:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Elections) విజయంతో భాజపా (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే నిర్వహించిన అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కమలదళం జయకేతనం ఎగురవేసింది. దీంతో దేశంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 13కు చేరుకుంది.

భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాలు

ఉత్తరాఖండ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, గోవా, అస్సాం, త్రిపుర, మణిపుర్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ; అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా (తాజా ఎన్నికల్లో విజయం)

ప్రభుత్వంలో భాజపా భాగస్వామిగా ఉన్న రాష్ట్రాలు

మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్‌, బిహార్‌, పుదుచ్చేరి (శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం) ; ఆంధ్రప్రదేశ్‌ (తెదేపా, జనసేన, భాజపా కూటమి)

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాష్ట్రాలు

హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ

ఝార్ఖండ్‌లో జేఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు మిత్రపక్షంగా ఉన్నా.. ప్రభుత్వంలో చేరలేదు.

కాంగ్రెస్‌, భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు

మిజోరం (జడ్పీఎం), పంజాబ్‌ (ఆప్‌), కేరళ (ఎల్డీఎఫ్‌), సిక్కిం (ఎస్‌కేఎం), పశ్చిమబెంగాల్‌ (టీఎంసీ), దిల్లీ (ఆప్‌) (శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం), జమ్మూ-కశ్మీర్‌ (రాష్ట్రపతి పాలన)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని