Viral video: ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ...వీడియో వైరల్‌

పంజాబ్‌లోని ఓ ఇంటిపై నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated : 27 May 2024 12:04 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: న్యూయార్క్‌ (New York)లో ప్రసిద్ధి చెందిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (replica of the Statue of Liberty) వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో  నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీరు ఇలా ఆశ్చర్యపోవడానికి కారణం ఆ విగ్రహం భారత్‌లో ఉండటమే. పంజాబ్‌ (Punjab)లోని తరణ్‌ తారణ్‌ ప్రాంతంలో ఉన్న ఓ బిల్డింగ్‌పై స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నమూనాను నిర్మిస్తున్న వీడియో సోషల్‌ మీడియా (social media) లో వైరల్‌గా మారింది. అలోక్‌ జైన్‌ అనే నెటిజన్‌ ఈ వీడియోను పంచుకుంటూ పంజాబ్‌లో ఓ ఇంటిపై  స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఏర్పాటు చేశారు అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది. నెటిజన్లు వైరల్‌ వీడియోపై స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ఓ నెటిజన్‌ స్పందిస్తూ అది తప్పకుండా వాటర్‌ ట్యాంక్‌ అయి ఉంటుంది. ఎందుకంటే పంజాబ్‌లో మనం విమానాలు, ఎస్‌యూవీలు మొదలైన ఆకారాల్లో ఉన్న ట్యాంక్‌లను చూస్తాము అని వ్యాఖ్యానించారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ మీరు కోరుకున్న దేశానికి వెళ్లడానికి వీసా దొరకకపోతే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అంటూ రాసుకొచ్చారు. మరో నెటిజన్‌ ఇకపై లిబర్టీని చూడాలంటే మనం న్యూయార్క్‌ వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి వెళ్తే సరిపోతుంది అంటూ చమత్కరించారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 3,16,000 మంది నెటిజన్లు వీక్షించారు.

 1884లో యూఎస్‌ స్వాతంత్ర్యదినోత్సవానికి గుర్తుగా ఫ్రాన్స్‌ (France) బహుమతిగా స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని ఇచ్చింది.  ప్రస్తుతం ఇది న్యూయార్క్‌లోని బేలోని లిబర్టీ ద్వీపంలో ఉంది. ఈ విగ్రహం ఎత్తు 305 అడుగుల (93 మీటర్లు). గ్రీకు పురాణాల్లోని స్వేచ్ఛాదేవత విగ్రహాన్ని పోలీవుంటుంది. కుడి చేతిలో దివిటీ, ఎడమ చేతిలో స్వాతంత్ర ప్రకటనకు సంబంధించిన పుస్తకం ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని