Lok Sabha: ‘పరీక్షల్లో అక్రమాల కట్టడి’ బిల్లుకు.. లోక్‌సభ ఆమోదం

కొలువుల పోటీ పరీక్షల్లో అక్రమాల కట్టడికి రూపొందించిన బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది.

Published : 06 Feb 2024 18:35 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల్లో జరిగే అక్రమాలను అడ్డుకునేందుకు వీలుగా రూపొందించిన ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024’కు మంగళవారం లోక్‌సభ (Lok Sabha)లో ఆమోదం లభించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ (Jitendra Singh) దీన్ని సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రతిభావంతులైన విద్యార్థులు, అభ్యర్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన బిల్లుగా దీన్ని పేర్కొన్నారు.

లీకేజీకి పాల్పడితే భారీ శిక్ష

ఈ బిల్లుకు సంబంధించి విపక్ష సభ్యులు ప్రతిపాదించిన కొన్ని సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం లోక్‌సభ దీన్ని ఆమోదించింది. ఇది అమల్లోకి వస్తే పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్‌ ప్రాక్టీస్‌ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా.. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.కోటి వరకూ జరిమానా పడనుంది. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎన్‌డీఏ వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్‌, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశపరీక్షలకూ వర్తిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని