lok sabha phase 6: ఆరో విడత పోలింగ్‌.. 58 స్థానాల్లో ప్రారంభమైన ఓటింగ్‌

ఆరో విడతలో భాగంగా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది.

Updated : 25 May 2024 07:30 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది. ఆరో విడతలో భాగంగా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసింది. దేశ రాజధాని దిల్లీ, హరియాణాల్లోని అన్ని నియోజకవర్గాలకు ఈ దశలోనే ఓటింగ్‌ పూర్తికానుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను మొత్తం ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఆరో దశతో 486 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది.

దిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్నింటా భాజపా, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్యే పోరు కేంద్రీకృతమైంది. పొత్తులో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 4, కాంగ్రెస్‌ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపాయి. భాజపా అభ్యర్థులకు వారు గట్టి సవాలు విసురుతున్నారు. మరోవైపు- ఒడిశాలో 42 అసెంబ్లీ స్థానాలకు కూడా శనివారం పోలింగ్‌ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు