Lok sabha Elections: సార్వత్రిక ఎన్నికలకు తొలి నోటిఫికేషన్‌ విడుదల

సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections 2024) తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Updated : 20 Mar 2024 09:21 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections 2024) తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27 గడువు. 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్‌ 19న ఈ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్‌ జరగనుంది. 

ఎన్నికలు జరగనున్న వాటిలో తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అస్సాంలలోని ఐదేసి, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని