Anand Mahindra: ఇరాన్‌ క్షిపణులను అడ్డుకున్న ఇజ్రాయెల్‌.. కేంద్రానికి మహీంద్రా సూచన

ఇరాన్‌ చేసిన దాడిని ఇజ్రాయెల్ ఎదుర్కొన్న తీరుపై ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. 

Published : 16 Apr 2024 17:09 IST

ముంబయి: 300కు పైగా డ్రోన్లు, క్షిపణులు ఇరాన్‌ వైపు నుంచి దూసుకొచ్చినా.. వాటన్నింటిని ఇజ్రాయెల్‌ నేలకూల్చింది. దీనిపై ఎక్స్‌ వేదికగా ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్టుకు బదులిస్తూ.. రక్షణ రంగంలో ఆ దేశ సామర్థ్యాన్ని ప్రశంసించారు.

‘‘ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ రక్షణ వ్యవస్థ అద్భుతం’’ అంటూ ఓ నెటిజన్ స్పందించారు. దాంతో ఆ దేశ రక్షణ సామర్థ్యం గురించి మహీంద్రా (Anand Mahindra) ప్రస్తావించారు. ‘‘వారి వద్ద ఐరన్‌ డోమ్‌ను మించిన సాంకేతికత ఉంది. బాలిస్టిక్‌ సహా దీర్ఘశ్రేణి, మధ్యశ్రేణి క్షిపణులను అడ్డుకోవడానికి ఉపయోగించే ది యారో, డేవిడ్ స్లింగ్‌లు ఉన్నాయి. లేజర్‌ను ఉపయోగించి పనిచేసే ఐరన్‌ బీమ్ వ్యవస్థ ఉంది. అమ్ముల పొదిలో ఈతరహా రక్షణ వ్యవస్థలు ఉండటం ఎంతో ముఖ్యం. ఆ దిశగా దృష్టి సారించి, అవసరమైన కేటాయింపులు చేయాలి’’ అని మన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

డ్రోన్లు, క్షిపణులను ఇజ్రాయెల్‌ ఎలా అడ్డుకుందంటే..

ఐరన్‌ డోమ్‌.. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్‌ తయారుచేసుకున్న వ్యవస్థ. తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను ఇది అడ్డుకుంటుంది. లెబనాన్‌ హెజ్‌బొల్లా, గాజా నుంచి హమాస్‌ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ నిర్వీర్యం చేస్తోంది. శత్రుపక్షం రాకెట్లు ప్రయోగించగానే ఈ వ్యవస్థ ఆటోమేటిగ్గా పని చేయడం ప్రారంభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని