Mallikarjun Kharge: ఆ రాష్ట్రాల్లో ఉనికిలో లేని పార్టీకి 400 స్థానాలా?: ఖర్గే

లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలు గెలుస్తామని భాజపా ప్రచారం చేయడంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. కొన్ని రాష్ట్రాల్లో ఉనికిలో లేని ఆ పార్టీ అన్ని సీట్లు ఎలా గెలుచుకోగలదని ప్రశ్నించారు. 

Published : 28 May 2024 18:58 IST

చండీగఢ్‌: సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు గెలవడం ఖాయమని కేంద్రంలోని భాజపా పలుమార్లు ప్రచారం చేయడంపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో ఉనికిలో లేని ఆ పార్టీ అన్ని స్థానాలను ఎలా గెలుచుకోగలదు అని ఎద్దేవా చేశారు. అమృత్‌సర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఖర్గే.. మోదీ సర్కార్‌పై విమర్శలు చేశారు. 

‘‘గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం భాజపా సీట్లను కోల్పోతోంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి పుంజుకుంటోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణలలో భాజపా ఉనికిలోనే లేదు. కర్ణాటకలో బలంగా లేదు. మహారాష్ట్రలో బలహీనంగా ఉండగా.. పశ్చిమబెంగాల్‌, ఒడిశాలలో పోటీ ఉంది. అలాంటప్పుడు కాషాయ పార్టీ 400 సీట్లు ఎలా గెలవగలదు? కనీసం 200 సీట్లు రావడమూ కష్టమే’’ అని ఖర్గే ఎద్దేవా చేశారు.

హైకోర్టులో డేరా బాబాకు ఊరట.. రంజిత్‌ సింగ్‌ హత్యకేసులో నిర్దోషిగా తీర్పు

మీ ఉద్యోగం గురించి ఆలోచించండి

ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతే.. ఖర్గే ఉద్యోగం ఊడిపోతుందని కేంద్రమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించడంపై హస్తం పార్టీ నేత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నేను ఉద్యోగం కోసం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు సేవ చేసుకునేందుకే వచ్చా. జూన్‌ 4 తర్వాత షా.. తన ఉద్యోగం గురించి ఆలోచించుకోవాలి’’ అని కౌంటర్‌ ఇచ్చారు. 

ఆయన గొప్పలు చెప్పుకోలేదు

బహిరంగ సభల్లో ప్రధాని మోదీ చాలా విషయాలు మాట్లాడతారు. కానీ, ఆయన తక్కువ పని చేస్తారని ఆరోపించారు. ‘‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హయాంలో రూ.72 వేల కోట్ల వ్యవసాయ రుణాలు కేంద్రం ఇచ్చింది. ఏ రోజూ ఆయన గొప్పలు చెప్పుకోలేదు. కానీ, మోదీ సర్కార్‌ మాత్రం చిన్న విషయాలను కూడా గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదం’’ అని ఖర్గే విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని