అమానవీయం.. యువకుడిపై మూత్ర విసర్జన.. వీడియో వైరల్‌

గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

Published : 04 Jul 2023 20:15 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోజువారీ కూలీగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసీ యువకుడిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ, ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు మండిపడుతున్నాయి. ‘‘ ఈ దారుణం ప్రభుత్వానికి కనిపించలేదా? నేరస్తుడిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు?’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు భాజపా ఎమ్మెల్యేకి అనుచరుడని అందుకే అతడిని అరెస్టు చేయలేదని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

కాగా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియో తన దృష్టికి వచ్చినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించానని తెలిపారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కూడా స్పందించారు. ఇలాంటి హేయమైన చర్యలకు నాగరిక సమాజంలో చోటు లేదని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలు అంతం కావాలన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని