‘జైలు’ భయంతో బల్లిని మింగేశాడు

అత్యాచారం కేసులో అరెస్టయి పోలీసుల రిమాండ్‌లో ఉన్న ఓ నిందితుడు తనను జైల్లో ఉంచుతారనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు.

Updated : 11 Jul 2023 08:43 IST

అత్యాచారం కేసులో అరెస్టయి పోలీసుల రిమాండ్‌లో ఉన్న ఓ నిందితుడు తనను జైల్లో ఉంచుతారనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగింది. మహేశ్‌ అనే యువకుడు ఓ బాలికను అత్యాచారం చేశాడంటూ కేసు నమోదైంది. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. తర్వాత జైలుకు తరలించాల్సి ఉంది. ఈ క్రమంలో భయంతో అతను పోలీస్‌స్టేషన్‌లోనే బల్లిని మింగాడని పోలీసులు తెలిపారు. దీంతో అతణ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని