Cyclone Mandous: తీవ్ర వాయుగుండంగా మారిన ‘మాండౌస్’.. చెన్నై అల్లకల్లోలం
మాండౌస్ (Cyclone Mandous) ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై (Chennai)లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి.
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండౌస్ (Cyclone Mandous) మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్రమంగా వాయువ్య దిశలో పయనిస్తున్న మాండౌస్.. శనివారం మధ్యాహ్నానికి మరింతగా బలహీనపడి వాయుగుండగా మారనుందని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో తమిళనాడులోని చెన్నై, చెంగల్పట్టు సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో చాలా చోట్ల వందలాది వృక్షాలు నేలకూలాయి. చెన్నైలో (Chennai) దాదాపు 200 చెట్లు కూలినట్లు అధికారులు తెలిపారు. ముందుగా అప్రమత్తమై భారీ హోర్డింగ్‌లకు రక్షణ ఏర్పాట్లు చేయడంతో పెను విధ్వంసం తప్పిందన్నారు.
మాండౌస్ కారణంగా చెన్నై, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. చెన్నైలో నిన్న 115 మి.మీల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతంలో భారీ వృక్షం కూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌పై పడింది. దీంతో బంకు ధ్వంసమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు సూచించారు. మాండౌస్ ప్రభావంతో తీరంలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి.
తుపాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. పది జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచింది. దాదాపు 5వేలకు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. మాండౌస్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స
-
Crime News
Crime: అసలే త్రిపుల్ రైడింగ్... ఒక్కరికి హెల్మెట్లు లేవు..పైగా వన్ వీల్‌తో విన్యాసాలు..
-
General News
Vande Bharat: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్’.. ప్రారంభోత్సవం రోజున ఆగే స్టేషన్లు ఇవే!
-
Movies News
Guna Sekhar: అప్పుడు మోహన్‌బాబు నా ఆఫర్ రిజెక్ట్ చేశారు: గుణశేఖర్
-
Politics News
KVP: జగన్‌కు ఎందుకు దూరమయ్యానో త్వరలోనే చెప్తాను : కేవీపీ
-
India News
IndiGo: గగనతలంలో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన.. ఇండిగో విమానంలో ఘటన