Budget session: స్పీకర్‌కు ‘తాళం’ గిఫ్ట్‌గా ఇచ్చిన ముఖ్యమంత్రి.. ఎందుకంటే!

ఓ అంశానికి సంబంధించి చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు సభలోనే ఉండేలా చూడాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ స్పీకర్‌కు విజ్ఞప్తి చేయడం గందరగోళానికి దారితీసింది.

Published : 04 Mar 2024 19:24 IST

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీలో (Punjab Assembly) అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓ అంశంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు సభలోనే ఉండేలా చూడాలంటూ స్పీకర్‌ను ముఖ్యమంత్రి (Bhagwant Mann) కోరారు. అంతేకాకుండా తాళం, కీ ఇచ్చిన సీఎం.. వాకౌట్‌ చేయకుండా వారిని సభలోనే ఉండేలా లోపల గడియపెట్టాలని విజ్ఞప్తి చేయడం మరింత గందరగోళానికి దారితీసింది.

పంజాబ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండోరోజు (సోమవారం) కొనసాగాయి. మార్చి 1న బడ్జెట్‌ సమావేశాలు (Budget session) ప్రారంభం అనంతరం గవర్నర్‌ చేసిన ప్రసంగానికి విపక్ష ఎమ్మెల్యేలు అడ్డుతగలారంటూ అధికార పార్టీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. దీంతో క్వశ్చన్‌ అవర్‌, జీరో అవర్‌లను పక్కన పెట్టిన స్పీకర్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్వన్‌ ప్రత్యేక చర్చకు అనుమతించారు.

ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌కు క్యాన్సర్‌.. ఆదిత్య ప్రయోగం రోజే తెలిసిందట!

చర్చ మొదలయ్యే కొన్ని క్షణాల ముందు స్పీకర్‌ దగ్గరకు వెళ్లిన సీఎం భగవంత్‌మాన్‌.. ఓ కవరులో తాళం, కీని అందించారు. సభ లోపలి నుంచి తాళం వేయాలని.. తద్వారా విపక్ష సభ్యులు చర్చ నుంచి తప్పించుకోకుండా చూడొచ్చని సూచించారు. విపక్ష నేత ప్రతాప్‌సింగ్‌ బజ్వా మాట్లాడుతూ.. తాము ఎక్కడికీ వెళ్లమని, సభలోనే ఉంటామన్నారు. ఈ క్రమంలోనే సీఎం, ప్రతిపక్ష నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జోక్యం చేసుకున్న స్పీకర్‌.. సభలో చర్చ జరిగేలా చూసేందుకు తాళం ఓ సంకేతమని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో చివరకు సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు