Modi: పాక్‌ కొత్త పీఎం షరీఫ్‌కు మోదీ శుభాకాంక్షలు

పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు మన ప్రధాని మోదీ(Modi) విషెస్‌ చెప్పారు. 

Published : 05 Mar 2024 13:31 IST

దిల్లీ: పాకిస్థాన్‌ ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన షెహబాజ్‌ షరీఫ్‌కు భారత పీఎం నరేంద్రమోదీ(Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్) వేదికగా పోస్టు పెట్టారు. పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ.. సోమవారం షరీఫ్ చేత ప్రమాణం చేయించారు. ప్రధాని పదవిని ఆయన అధిరోహించడం ఇది రెండోసారి. అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్‌ఖాన్‌ దిగిపోయిన తర్వాత 2022 ఏప్రిల్‌, 2023 ఆగస్టు మధ్య కాలంలో సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.

ఇదిలా ఉంటే..  ఇటీవల షరీఫ్‌ ప్రధానిగా ఎన్నికైన తొలిరోజే భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఆ సందర్భంగా తన ప్రసంగంలో కశ్మీర్‌ సమస్యను మరోసారి లేవనెత్తడమే కాకుండా దాన్ని పాలస్తీనాతో పోల్చడం గమనార్హం. ‘సమానత్వం ఆధారంగా పొరుగు దేశాలతో సంబంధాలను కొనసాగిస్తాం. అందరూ కలిసి రండి.. కశ్మీరీలు, పాలస్తీనీయుల స్వేచ్ఛ కోసం జాతీయ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఆమోదించాలి’ అంటూ తమ నీచబుద్ధి మారదని మరోసారి నిరూపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు