Arvind Kejriwal: జైల్లో ఆ మూడు పుస్తకాలు కావాలి: కోర్టును కోరిన కేజ్రీవాల్‌

జైల్లో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) కోర్టును కోరారు.

Published : 01 Apr 2024 15:10 IST

దిల్లీ: మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు రౌజ్‌ అవెన్యూకోర్టు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తిహాడ్‌ జైలుకు తరలించనున్నారు. ఈ క్రమంలో ఆయన కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది అప్లికేషన్ సమర్పించారు.

జైలులో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని కేజ్రీవాల్ కోరారు. రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన హౌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ డిసైడ్‌ (How Prime Ministers Decide) వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్స్‌, డైట్‌ ప్రకారం ఆహారం అందించాలని అడిగారు. ఇప్పటికే ధరిస్తోన్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.

కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ.. తిహాడ్‌ జైలుకు సీఎం

మద్యం కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో సీఎంను కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ క్రమంలోనే కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని