Road Accident: మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు.

Updated : 11 Jan 2024 18:52 IST

అనంతనాగ్‌: జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (PDP) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti)కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనం అనంత్‌నాగ్‌ జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఖనాబాల్‌లో అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఫ్తీ వాహనాన్ని మరో కారు ఢీకొట్టడంతో భద్రతా అధికారి గాయపడ్డారు. కారు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనలో ముఫ్తీ సురక్షితంగా బయటపడ్డారు.  కారు ప్రమాదానికి గురైనట్లు ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ వెల్లడించారు. భగవంతుడి దయవల్ల తన తల్లికి ఏమీ కాలేదని.. భద్రతా సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని