ఎన్డీయే ఎంపీల భేటీ.. మోదీ నాయకత్వానికి ఆమోదముద్ర

ఎన్డీయే ఎంపీలు దిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు.

Published : 07 Jun 2024 13:01 IST

దిల్లీ: ఎన్డీయే ఎంపీలు దిల్లీలో పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్‌హాల్‌లో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. మోదీ నాయకత్వానికి లాంఛనంగా ఆమోదముద్ర వేశారు. ఈ భేటీలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ సమావేశానికి 240 మంది భాజపా ఎంపీలతోపాటు తెదేపా, జేడీయూ, శివసేన, లోక్‌జన్‌శక్తి (రాంవిలాస్‌), ఎన్‌సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్‌ సహా ఇతర మిత్రపక్షాల ఎంపీలు, ఎన్డీయే పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం చంద్రబాబు, బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ సహా పలువురు అగ్రనేతలతో కలిసి మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమవుతారు. ఎన్డీయేకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను సమర్పిస్తారు. తన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతారు. ఎన్డీయేకు సంపూర్ణ మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆయన్ను సర్కారు ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని