నీట్‌ (యూజీ) నిర్వహణకు పక్కా ప్లాన్‌.. కలెక్టర్లు, ఎస్పీలతో అధికారుల వరుస భేటీలు!

Eenadu icon
By National News Team Published : 28 Apr 2025 16:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: దేశంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ యూజీ పరీక్ష (NEET UG 2025)కు కేంద్ర విద్యాశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. గతేడాది నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలతో తీవ్ర దుమారం నెలకొన్న వేళ ఈసారి పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మే 4న దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5 వేలకు పైగా పరీక్ష కేంద్రాల్లో నీట్‌ యూజీ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసేందుకు విద్యాశాఖ అధికారులు దేశంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 

గతేడాది నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ వంటి పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలు దుమారం రేగడంతో ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి నీట్‌ పరీక్షకు పక్కా ప్రణాళికను రూపొందించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ పరీక్షను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ లాజిస్టిక్స్‌, భద్రత, వంటి కీలక అంశాలపై చర్చిస్తుస్తూ అందరినీ సంసిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద ఎన్‌టీ ఏర్పాటు చేసే భద్రతతో పాటు ఆయా జిల్లాల పోలీసు భద్రతతో బహుళ అంచెల్లో తనిఖీలు చేయనున్నారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ షీట్లు వంటి కీలకమైన సామగ్రి రవాణా పూర్తిస్థాయిలో పోలీసు భద్రతలోనే చేపట్టనున్నారు. అలాగే, వ్యవస్థీకృత మోసాలను అరికట్టేందుకు కోచింగ్‌ సెంటర్లు, డిజిటల్‌ ప్లాట్‌ఫాంల కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో తప్పనిసరిగా తనిఖీలు చేపట్టేలా డ్యూటీ మెజిస్ట్రేట్‌లను నియమిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు