Sukhvinder Singh Sukhu: అక్టోబర్‌ వరకు అధికారిక సన్మాన కార్యక్రమాల్లేవ్‌.. హిమాచల్‌ సీఎం

భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్‌ నెలాఖరు వరకు అధికారిక సన్మాన కార్యక్రమాలు నిలిపివేయాలని నిర్ణయించింది.

Updated : 27 Aug 2023 22:24 IST

శిమ్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh)కు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. రూ.వేల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తుతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు(Sukhvinder Singh Sukhu) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖులకు శాలువాలు, టోపీలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించే విధానాన్ని అక్టోబర్‌ 31 వరకు నిలిపివేయాలని నిర్ణయించింది.

అలాగే, క్షేత్ర సందర్శనల సమయంలో వీవీఐపీలకు సంప్రదాయంగా ఇచ్చే గౌరవ వందనాన్ని సైతం సెప్టెంబర్‌ 15వరకు నిలిపివేస్తూ సీఎం ఓ ప్రకటన చేశారు.  ఈ చర్యలు పాలన పట్ల సమష్టి ఆచరణాత్మక విధానాన్ని పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనంగా ఉంటుందని పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా చోటుచేసుకున్న ఘటనల్లో 251 మంది మృతి చెందగా. ఈ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు దాదాపు రూ.12వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు